భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఇటీవల ఇద్దరు యువకులు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై హంగామా చేశారు. నంబర్ ప్లేట్లు తొలగించిన లగ్జరీ కార్లతో అర్ధరాత్రి విన్యాసాలు చేశారు. తమ కార్లను ఎవరూ గుర్తుపట్టరని అనుకున్నారు. కానీ.. పోలీసులు ఈ ఇద్దర్నీ అరెస్టు చేశారు. లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఫిబ్రవరి 9వ తేదీన రెండు కార్లు రయ్‌మంటూ ఓఆర్ఆర్ ఎక్కాయి. వాటికి నంబర్ ప్లేట్లు లేవు. ఆ కార్లు వేగంగా శంషాబాద్ మండలం తొండుపల్లి దగ్గరకు వచ్చాయి. ఆ కార్లలో ఉన్న యువకులు ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ వేశారు. కార్లను రోడ్డు మధ్యలో గిరగిరా తిప్పుతూ విన్యాసాలు చేశారు. రోడ్డు మధ్యలో ఇలా చేయడంతో.. ఇతర వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

ఈ స్టంట్లకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కార్లకు నంబర్ ప్లేట్లు లేకున్నా.. అందులోని యువకులు ముఖాలు కెమెరాల్...