తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 2 -- వందేళ్ల పాటు సేవలందించేలా కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ ఆస్పత్రి నిర్మాణం తెలంగాణ రాష్ట్ర వైద్య చరిత్రలో మరో కీలక మలుపు అని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కొత్త నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భవన నిర్మాణ నమూనాను కూడా ఖరారు చేసింది. ఇందుకు అనుగుణంగా. శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అయితే ఈ కొత్త ఆస్పత్రి ఎలా ఉంటుంది..? ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....