భారతదేశం, ఫిబ్రవరి 22 -- Hyderabad Murder : హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. ఇటీవల మేడ్చల్ లో సోదరుడిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కన్న కొడుకే తండ్రిపై కత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి(45), అతడి కుమారుడు సాయి కుమార్ (25) ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండడంతో కొడుకు సాయికుమార్‌ విసిగిపోయాడు. దీంతో శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరారు. బైక్ పై అతడిని కుమారుడు ఫాలో అయ్యాడు.

ఈసీఐఎల్‌ బస్‌ టెర్మినల్‌ సమీపంలో బస్సు దిగిన తండ్రి మొగిలిపై సాయి కుమార్ కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అందర...