భారతదేశం, జనవరి 26 -- సికింద్రాబాద్ విక్రమ్ పురి కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేష్ హత్య కేసును పోలీసులు చేధించారు. కొనుగోలు చేసిన సరుకుకి సొమ్ము చెల్లిస్తామని అతడిని రప్పించారు. అతడినే బంధించి భారీ ఎత్తున డబ్బు కాజేశారు. ఈ విషయం బయటపడితే పోలీస్ కేసు తప్పదనే భయపడ్డారు. వ్యాపారిని హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరిలించారు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఖార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్రమ్ పురి కాలనీలో వ్యాపారి బొల్లు రమేష్ నివసిస్తున్నారు. రమేష్ రెండు రాష్ట్రాల్లోని దుకాణాలకు పాన్ మసాల సరఫరా చేస్తున్నారు. పెద్దఎత్తువ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్టకు చెందిన సజ్జాద్ అహ్మద్ ఖాన్‌తో పరిచయం ఏర్పడి...