భారతదేశం, జనవరి 25 -- దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద రవాణా వ్యవస్థ హైదరాబాద్ మెట్రో. అత్యంత వేగంగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అయితే.. మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు స్టేషన్లకు చేరుకోవడానికి, స్టేషన్ల నుంచి ఇంటికి వెళ్లడానికి సొంత వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌లను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ కష్టాల కారణంగా సమయానికి చేరుకోవడం లేదు. ఈ సమస్యలకు హైదరాబాద్ మెట్రో పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.

హైదరాబాద్ మొట్రో ఫస్ట్, లాస్ట్ కనెక్టివిటీల వద్ద ఈవీ వాహనాలను అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వాహనాలను మెట్రో ఎండీ ప్రారంభించారు. ఈ వాహనాలను నడపడానికి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ట్రాఫిక్‌లోనూ వాహనాలను నడిపేలా మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవింగ్‌లో ఐదు...