భారతదేశం, మార్చి 29 -- Hyderabad Metro Rail : హైదరాబాద్ రవాణాలో మెట్రో రైల్ కీలకపాత్ర పోషిస్తుంది. తాజాగా మెట్రో నిర్వాహకులు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో సమయం పొడిగించినట్లు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉండే మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ సమయాలు అమల్లో ఉంటాయన్నారు. టెర్మినల్‌ స్టేషన్ల నుంచి ఆదివారాల్లో మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని మెట్రో పేర్కొంది.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించటం కోసం టెర్మినల్ స్టేషన్‌ల నుంచి చివరి రైలు బయలుదేరే సమయం 1 ఏప్రిల్ 2025 నుంచి... 11:00 PM నుంచి 11:45 PM (సోమవ...