తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 3 -- హైదరాబాద్ నుంచి హాంకాంగ్ మధ్య నడిచే నాన్ స్టాప్ విమాన సర్వీసులను క్యాథే పసిఫిక్ ఎయిర్ వేస్ లిమిటెడ్ పునరుద్ధరించింది. ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్ఐఎఎల్) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం... క్యాథే పసిఫిక్ ఎయిర్ వేస్ లిమిటెడ్ సేవలు ఐదు భారతీయ నగరాలలో అందుతున్నాయని వెల్లడించింది. ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తోపాటు హైదరాబాద్ నగరం ఉన్నట్లు పేర్కొంది.

2020 లో కోవిడ్ -19 మహమ్మారి సమయంలో హైదరాబాద్ నుంచి సాగే కార్యకలాపాలను క్యాథే పసిఫిక్ నిలిపివేసింది. ఆ తర్వాత గత నెల మార్చి 31న సేవలను తిరిగి ప్రారంభించింది. ప్రయాణికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సేవలు. వారానికి మూడుసార్లు(సోమ, గురు, ఆదివారం) అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్-హాంకాం...