భారతదేశం, సెప్టెంబర్ 6 -- భారీ భద్రత మధ్య హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్​ బండ్​ పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున నుంచే విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది. వాహనాలు, ప్రజల రద్దీ మధ్య ట్యాంక్​ బండ్​ కిక్కిరిసిపోతోంది. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్​ బండ సహా నగరంలోని ఇతర కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

గణేశ్​ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్​ మెట్రో రద్దీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను నడిపనున్నట్టు ప్రకటించారు.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్​ గణేశ్​ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్​ గణేశ్​ శోభాయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ట్యాంక్​ బండ్​లో భారీ విగ్రహాన్ని ని...