భారతదేశం, ఫిబ్రవరి 1 -- Hyderabad Firing : హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ కాల్పులు జరిపాడు. ప్రిజం పబ్‌ దగ్గర తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై దొంగ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, ఓ బౌన్సర్‌కు గాయాలయ్యాయి. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసున్నారు. దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని సమాచారం.

గచ్చిబౌలి కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామంగా తెలుస్తోంది. బత్తుల ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రభాకర్ గచ్చిబౌలి ప్రిజం పబ్‌ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందు...