భారతదేశం, ఏప్రిల్ 7 -- హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గర్భిణిపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2024 అక్టోబర్ లో బెంగాల్‌కు చెందిన షబానా పర్వీన్‌తో.. మహమ్మద్ బస్‌రత్ ప్రేమ వివాహం జరిగింది. హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివాసముంటూ.. మహమ్మద్ బస్‌రత్ ఇంటీరియర్ పనులు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే భార్య షబానా గర్భం దాల్చింది. గత నెల 29న ఆసుపత్రిలో చేరింది. డిశ్చార్చ్ అయిన తర్వాత ఆసుపత్రి ముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య పర్వీన్‌ను రోడ్డుపై పడేసి భర్త మహమ్మద్ బస్‌రత్ బండరాయితో దాడి చేశాడు. ప్రస్తుతం పర్వీన్ కోమాలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమె చనిపోయిందని అనుకున్న బస్‌రత్.. తన మోటార్ సైకిల్‌పై అక్కడి నుండి పారిపోయాడు. అటుగా వ...