తెలంగాణ,హైదరాబాద్, మార్చి 26 -- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూనివర్శిటీకి చెందిన భూములను వేలం వేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి యూనివర్శిటీకి చెందినదని. ఇక్కడ జీవ వైవిద్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఆరోపిస్తున్నారు.

ఓవైపు విద్యార్థుల ఆందోళన చేస్తుండగా. మరోవైపు ప్రభుత్వ స్పందన మరోలా ఉంది. ఆ భూములతో యూనివర్శిటీకి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. ఆ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదే అని చెబుతోంది. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించామని అంటోంది. అసలు హెచ్ సీయూ భూముల వివాదమేంటి..? విద్యార్థుల ఆందోళనకు కారణాలేంటి..? వంటి వాటిపై అంశాలకు సంబంధించిన ము...