భారతదేశం, ఫిబ్రవరి 27 -- దేశంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కేఆర్‌సీ క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

'ప్రతిరోజూ బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో.. పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో.. గత సంవత్సరం సంతకం చేసిన ఎంవోయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోంది. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్‌గా నిలిచాం. మన దగ్గర అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయి. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరు అన్నారు' అన...