భారతదేశం, ఫిబ్రవరి 15 -- హైదరాబాద్ నగరంలో ఉష్టోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ముఖ్యంగా ఏసీల వినియోగం బాగా పెరిగిందని విద్యుత్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఏసీల వినియోగం భారీగా పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు హైదరాబాద్‌లో కూడా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. దీంతో చల్లదనం కోసం ఏసీలను వాడడం తప్పనిసరి అవుతుంది.

హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ఇక్కడికి వలస వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీల వాడకం కూడా పెరుగుతోంది.

ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దీని వల్ల ఏసీ వంటి సౌకర్యాలను ...