భారతదేశం, మార్చి 29 -- హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జావస‌రాల‌కు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజ‌ధాని న‌గ‌రంతో పాటు హెచ్ఎండీఏ ప‌రిధిలో హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.

వివిధ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెంచ‌డం, ప్ర‌జ‌లు ఎటువంటి అవాంత‌రాలు లేకుండా రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర‌హ‌దారుల నిర్మాణం ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు. అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, ప్ర‌స్తుతం ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ విష‌యంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ...