భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే జరిపిందని.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. ఇందుకోసం సబ్ కమిటీ, డెడికేటెడ్ కమిటీ వేసుకొని కేబినెట్ తీర్మానం చేసినట్టు చెప్పారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ.. రెండు వేరువేరు బిల్లులు చట్టం చేసినట్టు వివరించారు.

'తెలంగాణ బీసీల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు. వారం రోజుల్లో బీసీ మేధావులు, కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకొని.. భవిషత్ కార్యాచరణ రూపొందిస్తాం. శాసన సభలో బీజేపీ, బీఆర్ఎస్ ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్లు పెంచే తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా కుల సర్వే రోల్ మోడల్‌గా నిలిచింది. దీన్ని అమలు చేయడానికి ప్రక్రియ వేగవంతం చేస్తాం' అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

'శాసన సభలో...