తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారుల దాడులు నిర్వహించగా.. ఈ వ్యవహారం వెలుగు చూసింది. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నట్లు తేలింది.

కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం తొమ్మిది మంది విదేశీ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

గుట్టుచప్పుడు కాకుండా టీఎన్‌జీవోస్‌ కాలనీలోని ఓ ఇంట్లో కొంతకాలంగా వ్యభిచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. దీంతో ఈ హైటెక్ సెక్స్ రాకెట్ బాగోతం బట్టబయలైంది....