భారతదేశం, జనవరి 27 -- అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతీ సందర్భాన్ని తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇటీవల జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పలు సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. దీన్ని ఛాన్స్‌గా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. అదే తరహాలో ప్రకటనలు ఇచ్చి మోసం చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళ ఖాతా నుంచి రూ.40 కాజేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో లెహంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. రూ.40 వేలు పోగొట్టుకుంది. జూబ్లిహిల్స్‌లో నివాసముంటున్న శ్రీవల్లి అనే మహిళ.. ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా ఓ లెహంగా కనిపించింది. దీంతో పూజా కలెక్షన్స్ పేరుతో ఉన్న పేజీలోకి వెళ్లింది. ఓ లెహంగా కోసం ఆ పేజీలో సూచించిన స్కానర్‌కు రూ.1000 చెల్లించింది.

డబ్బులు చెల్లించి రెండు రోజులు అయ్యింది. కానీ తాను ఆర్డర్ పెట్టిన లెహ...