భారతదేశం, ఏప్రిల్ 8 -- రేవంత్‌ రెడ్డి, కేటీఆర్ ప్రాణ మిత్రులు అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రేవంత్, కేటీఆర్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రేవంత్ కాపాడుతున్నారన్న బండి.. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసి వెళ్లారని చెప్పారు. హైదరాబాద్‌లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని వివరించారు.

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎంఐఎంను గెలిపించేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్, కేటీఆర్ కలిసి బీజేపీనిని దెబ్బ తీయాలని చూస్తున్నారని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా.. అని సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్‌ను కాపాడేందుకే కేటీ...