భారతదేశం, ఫిబ్రవరి 13 -- హైదరాబాద్ నగరంలో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణం అని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐటీ జర్నీలో ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్- హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని వివరించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్న రేవంత్.. హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చెప్పారు.

'మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభ...