భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఆ ఆడపిల్లలను అన్నీతానై చూసుకుంటున్న తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. ఈ బాధను తట్టుకోలేని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంతో కుంగిపోయారు. ఏం చేయాలో తెలియక.. దిక్కుతోచక.. ఎవరికీ చెప్పకుండా.. తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉండిపోయారు. 9 రోజులపాటు తిండిలేదు. నీరసించిపోయారు. ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.

తాజాగా ఈ కేసులో మృతురాలి కుమార్తెలు రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 22న లలిత మృతి చెందింది. 23న ఆమె ఇద్దరు కూతుళ్లు రవలిక, యశ్విత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. దీనికి సంబంధించిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తమ సూసైడ్‌కు కారణం మేనమామ బిట్ల రమేష్, ప్రకాష్ రెడ్డి, తండ్రి సీఎల్ రాజు అని రవళిక, యశ్విత లేఖలో రాశా...