భారతదేశం, మార్చి 23 -- తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, నటులపై కేసులు నమోదయ్యాయి. పలువురు పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. తాజాగా.. ఇదే ఇష్యూలో స్టార్ హీరోలు ప్రభాస్, నందమూరి బాలకృష్ట, గోపిచంద్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఫిర్యాదు ప్రకారం.. ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ సీజన్-2 షో జరిగింది. దీంట్లో హీరోలు ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణ సంయుక్తంగా 'Fun88' అనే చైనీస్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు అంటూ.. మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. లక్షలాది మందిని మోసం చేశారని, పైన పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఫిర్యాద...