భారతదేశం, మార్చి 24 -- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల. న్యాయవాదిలో కలిసి విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు కేసులో పోలీసులు ఐదుగురిని విచారించారు. తేజ, కానిస్టేబుల్‌ కిరణ్‌, విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించారు. పరారీలో ఉన్నవారికి మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. భయ్యా సన్నీయాదవ్‌ ముందస్తు బెయిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణలో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకుని, అప్పులపాలై, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన యాంకర్లు, నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌...