భారతదేశం, ఏప్రిల్ 6 -- బెట్టింగ్ యాప్స్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులపాలైన రాజ్వీర్సింగ్ (25) అనే యువకుడు.. సూసైడ్ చేసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే సికింద్రాబాద్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు సుచిత్రలోని బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్లో నివాసం ఉండేవాడు.

బెట్టింగ్ యాప్‌ల కారణంగా తెలంగాణలో ఈ మధ్యనే 15 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు పెరిగాయని పోలీసులు గుర్తించారు. ఈ యాప్‌ల వలన కలిగే ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లపై ప్రత...