భారతదేశం, మార్చి 25 -- క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని సోమేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌడవెల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్.. క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. మనోవేదనతో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటారు. ఈ వెబ్‌సైట్‌లు, యాప్‌లు మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల పనితీరు, ఇతర అంశాలపై పందెం వేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. ఈ వెబ్‌సైట్‌లు, యాప్‌లను విదేశీ సర్వర్‌లలో హోస్ట్ చేస్తారు. దీంతో వీటిని గుర్తించడం, నియంత్రించడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలో క్...