భారతదేశం, మార్చి 21 -- బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, టేస్టీ తేజ, కిరణ్‌గౌడ్ విచారణ పూర్తయ్యింది. మరికొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. అటు పోలీసుల విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్ వంటి వారు దుబాయ్ వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చాలామంది సినీతారలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్‌తో సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా లబ్ధి పొందినట్టు సమాచారం. వీరికి ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందనే అంశంపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

మన దేశంలో బెట్టింగ్, జూదం చట్ట విరుద్ధం. కొన్ని రాష్ట్రాలు లాటరీ, గుర్రపు పందాలను అనుమత...