భారతదేశం, ఫిబ్రవరి 25 -- బయో ఏషియా.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు, ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయని చెప్పారు.

'ముందునుంచీ పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోంది. మేం ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టాం. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజనీర్ల సమూహాన్నీ తయారు చేశాం. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగా...