భారతదేశం, ఫిబ్రవరి 13 -- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌ నిర్వహణపై విచారించనున్నారు. ఫామ్‌హౌస్‌ యజమానిగా ఎమ్మెల్సీ పోచంపల్లి ఉండటంతో.. ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల రాజేంద్రనగర్ పోలీసులు.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న క్యాసినో, కోడి పందాల రాకెట్‌ను ఛేదించారు.

కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర శివార్లలో గుట్టుగా కోళ్ల పందాలు, క్యాసినోలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో.. ఎస్వోటి పోలీసులు దాడులు చేసి జూదం ఆడుతున్న వారిని పట్టుకున్నారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు. పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కో...