భారతదేశం, ఫిబ్రవరి 28 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) నూతన పార్కింగ్‌ విధానం రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఆసక్తి ఉన్న సంస్థలు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో.. ప్రాజెక్టును అమలు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సమగ్ర ప్రతిపాదనలు, ప్రణాళిక అందజేస్తే.. ఉత్తమ పద్ధతిన ఎంపిక చేస్తామని జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కార్యాలయం టెండరు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ విధానం ద్వారా ఇంటి నుంచే.. వెళ్లబోతున్న ప్రాంతంలో మన వాహనానికి పార్కింగ్‌ వసతిని రిజర్వు చేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూకట్‌పల్లి జోనల్‌ అధికారులు.. ఫోరంమాల్‌ వద్దనున్న పైవంతెన కింద 200 ద్విచక్ర వాహనాలకు స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత.. సికింద్రాబాద్‌ త...