భారతదేశం, ఫిబ్రవరి 7 -- నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా. దట్టమైన పొగ బయటకు వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు, నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....