భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. బీడీఎల్, డీఆర్‌డీవో, మిదానీ, హెచ్ఏఎల్ వంటివి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయని వివరించారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, చుట్టూ పరిశ్రమలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

'దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులకు దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఏటా లక్షకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చద...