Hyderabad, ఏప్రిల్ 10 -- పర్యావరణ హిత నగరానికి హైడ్రా దిక్సూచి వంటిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. చెరువులు, పార్కులు, నాళాలు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా పరిరక్షేందుకు ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

ఆదిలో హైడ్రా చట్టబద్ధత పై పలువురికి అనుమానాలున్నా తర్వాత అన్ని పటాపంచలయ్యాయని వ్యాఖ్యానించారు. గురువారం ఎల్బీ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన. జీవితంలో పెళ్లి, సొంత ఇళ్లు చాలా ముఖ్యమైన అంశాలని.. వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

"స్థిరాస్తి కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది సర్వే నంబర్లను మార్చేసి, ప్రైవేట్ పట్టాల అనుమతులతో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టేసి అమ్మేస్తున్నారు. అందుకే అన్ని విధాల పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. హైడ్రా రావడంతో...