భారతదేశం, జనవరి 30 -- తెలంగాణ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లు ఓ నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. అతని కదలికలు అనుమానంగా ఉండడంతో.. సచివాలయ సీఎస్‌వో దేవిదాస్ ఆదేశాల మేరకు.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నిఘా పెట్టారు. పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అతన్ని పట్టుకున్నారు.

ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు.. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు సృష్టించుకున్నాడు. మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు అధికారులు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవిపై ఇంటెలిజెన్...