భారతదేశం, ఫిబ్రవరి 18 -- తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలోని మూడు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రత విషయంలో క్షేత్రస్థాయిలో ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీల‌న‌ చేస్తానని. ఎక్క‌డైనా చెత్త క‌న‌ప‌డితే స‌హించ‌మ‌ని అధికారుల‌ను హెచ్చ‌రించారు.

హైద‌రాబాద్‌ , మల్కాజ్‌గిరి , సైబరాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌ల క‌మిష‌న‌ర్లు తెల్ల‌వారుజామున ఆరు గంట‌ల‌కే క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని ఆదేశించారు. పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలో ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం పెంపు పాల‌సీపై స‌మీక్షించారు. వివిధ అంశాలపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

"న‌గ‌రంలో కూడ‌ళ్లు, ఇత‌ర ప్రాంతాల్...