భారతదేశం, ఏప్రిల్ 7 -- హైదరాబాద్‌లో ఘరానా మోసం జరిగింది. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ.. ఢిల్లీకి చెందిన షకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. హైదరాబాద్ పాతబస్తీలోని తన ఫ్రెండ్ షాపునకు రావాలని చెప్పాడు. దీంతో చాలామంది బట్టతల ఉన్నవారు షకీల్ వద్దకు వెళ్లారు. ఒక్కొక్కరి దగ్గర రూ.100 తీసుకుని గుండు కొట్టి, కెమికల్స్ రాసి పంపించాడు.

గుండు ఆరిపోకుండా ఉంచాలని.. అప్పుడే మళ్లీ వెంట్రుకలు నిండుగా వస్తాయని షరతు కూడా పెట్టాడు. అందుకు అంగీకరించి చాలామంది కెమికల్ రాసుకున్నారు. వారి దగ్గర డబ్బులు తీసుకొని షకిల్ వెళ్లిపోయాడు. అయితే.. కొంతమందిపై కెమికల్ ఎఫెక్ట్ చూపించింది. తలపై బొబ్బలు వచ్చాయి. బట్టతల ఏమో కాని.. ఉన్న వెంట్రుకలూ పోయాయని వందలాది మంది యువకులు లబోదిబోమంటున్నారు. బాధిత యువకులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

జుట్టు రాలడానికి అనేక క...