భారతదేశం, ఫిబ్రవరి 20 -- హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభంకానున్న మెడికవర్ హాస్పిటల్. అధికారిక ప్రారంభానికి ముందే అత్యవసర వైద్య సేవల బలోపేతానికి కీలక ముందడుగు వేసింది. దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రోగుల అత్యవసర రవాణా మరియు సమన్వయ సేవలను మెరుగుపరచేందుకు 'Evergreen Healthcare‌' తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఆసుపత్రి ప్రారంభమైన తొలి రోజు నుంచే అత్యవసర పరిస్థితులను సమర్థంగా నిర్వహించే సమగ్ర వ్యవస్థ సిద్ధంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ అంబులెన్స్ సేవలు, రాష్ట్రాల మధ్య క్రిటికల్ కేర్ ట్రాన్స్‌ఫర్లు, క్లిష్టమైన మరియు అత్యాధునిక చికిత్స అవసరమయ్యే కేసుల కోసం అంతర్జాతీయ రోగుల రవాణా వంటి సేవలు సమన్వయంతో అందించబడనున్నాయి.

ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, తీవ్రమైన గాయాలు, అ...