భారతదేశం, మార్చి 16 -- హైదరాబాద్ శివారు కోకాపేటలోని ఓ రెస్టారెంట్‌లో పేలుడు కలకలం రేపింది. హోటల్ వంటగదిలో గ్యాస్ లీకై భారీ శబ్దం వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి 50 శాతం పైగా ఒళ్లు కాలిపోయింది. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కోకాపేటలో జీఏఆర్ టవర్ కింది అంతస్తులో రెస్టారెంట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వంటగదిలో గ్యాస్ పైప్ లైన్ అమర్చే క్రమంలో.. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో యజమాని రాకేశ్, పనుల్లో ఉన్న శివ దుర్గ, రిజ్వాన్, అన్వర్ మాలిక్, ఫారూక్ మాలిక్, రాజు గాయపడ్డారు. భారీ శబ్ధం వచ్చినా మంటలు లేకపోవడం, మరోవైపు ఆరుగురు కాలిన గాయాలతో అక్కడ పడి ఉండడంతో ఘటనా స్థలం సమీపంలో ఉన్నవారికి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.