భారతదేశం, మార్చి 11 -- Hyd Suicides: హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులతో ఓ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రైవేట్‌ కరాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే చంద్రశేఖర్‌ రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని చంపి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కొన్ని నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుంగిపోయిన చంద్రశేఖర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోడానికి భార్యను ఒప్పించి పిల్లలకు విషం ఇచ్చి చంపేసి భార్యతో కలిసి ప్రాణాలు విడిచాడు.

మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కె.చంద్రశేఖర్రెడ్డి హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. భార్య కవిత(35), పిల్లలు శ్రీతా(15), విశ్వంత్(10)లతో కలిసి హబ్సిగూడలోని మహేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. కవిత గృహిణి కాగా కుమార్తె శ్రీతా తొమ్మిదో తరగతి, కుమారుడు విశ్వంత్ ఐదో తరగతి చదువుతున్న...