భారతదేశం, జనవరి 29 -- Hyd Metro Signal Issues: సిగ్నలింగ్ సమస్యలతో హైదరాబాద్‌ మెట్రో రైల్ సర్వీసుల్లో ఇబ్బందులు తలెత్తాయి. నాగోల్‌ -రాయదుర్గం బ్లూ లైన్‌లో సమస్యలు తలెత్తడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలు మందగించడంతో మిగిలిన మార్గాల్లో రద్దీ పెరిగి పోయింది. మెట్రో సర్వీసులకు బుధవారం ఉదయం నుంచి అంతరాయం కలిగింది. గతంలో కూడా ఈ తరహా సమస్యలు తలెత్తినా వాటిని వెంటనే సరిచేయగలిగారు. తాజాగా తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసేందుకు ఎల్‌ అండ్ టి ప్రయత్నిస్తోంది.

బ్లూ లైన్‌ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో మిగిలిన కారిడార్లలో కూడా అంతరాయం ఏర్పడింది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. కనెక్టింగ్ సర్వీసులను అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. రైళ్లు మెల్లగా నడుస్తుండటంతో గమ్యస్థానాలకు చేరుకోడానికి అవస్థలు ...