భారతదేశం, జనవరి 26 -- Hussain Sagar Fire Accident : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. హుస్సేన్ సాగర్ లో బాణసంచా ఉన్న బోట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోట్లలో ప్రయాణికులు ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 'భరతమాతకు మహా హారతి' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన రెండు బోట్లలో భారీగా బాణా సంచా సామాగ్రిని హుస్సేన్‌ సాగర్‌ మధ్యల...