భారతదేశం, మార్చి 11 -- Husband Climbs High Tension Pole : భార్య కాపురానికి రావడం లేదని భర్త విద్యుత్ హై టెన్షన్ టవర్ ఎక్కాడు. ప్రమాదకర పరిస్థితులో హై టెన్షన్ టవర్ పై ఆందోళనకు దిగాడు. కరెంట్ వైర్లను ముట్టుకునేందుకు యత్నించడంతో స్థానికులను టెన్షన్ కు గురయ్యారు. హైరానపడ్డ పోలీసులు చివరకు భార్యను తీసుకొచ్చి భర్తను టవర్ నుంచి కిందికి దింపి తిక్క కుదిర్చారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది.

పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం ఎన్టీపీసీలో కూలి పని చేసుకునే బీహార్ కు చెందిన అజయ్ హల్ చల్ చేశాడు. భార్య ప్రీతితో గొడవ పడడంతో స్థానికంగా ఉండే బంధువుల వద్దకు ఆమె వెళ్లిపోయింది. భార్య ఎడబాటును తట్టుకోలేని అజయ్ మద్యం సేవించి మత్తులో మేడిపల్లి సెంటర్ లోని విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కాడు. విద్యుత్ వైర్ల వరకు వెళ్లి భార్య కావాలని డిమాండ్ చేశాడు. ప్ర...