భారతదేశం, ఏప్రిల్ 4 -- How to recognize fake Aadhaar: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు అంచుల ఖడ్గంగా మారింది. ఏఐ తో సానుకూలతతో పాటు అదే స్థాయిలో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. తాజాగా, భారత ప్రభుత్వం మాత్రమే జారీ చేయాల్సిన ఆధార్ కార్డును ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చాట్ జీపీటీలో సులభంగా సృష్టిస్తున్నారు. దీనివల్ల అనేక సమస్యలు, భద్రతాముప్పులు వచ్చే ప్రమాదముంది.

పిల్లలు, శిశువులతో సహా ప్రతి భారతీయ వ్యక్తికి ఆధార్ కార్డు ను భారత ప్రభుత్వం తప్పని సరి చేసింది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు. ఇది "డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేకతను నిర్ధారిస్తుంది" అని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ఒకే యూనిక్ ఆధార్ ఐడీ నెంబర్ ఇస్తారు. చాలా ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ ను తప్పని సరి చేశారు. ...