Hyderabad, ఫిబ్రవరి 20 -- జీవితంలో సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో, ఎప్పుడైనా ఆలోచించారా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఇవి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. కల ఒకటి, కష్టం మరొకటి అయితే ఆశించిన విజయానికి బదులు, దక్కే ఫలితం ఇంకొకటి అవుతుంది. మీ కోసం, మీ విజయం కోసం, మీ సంతృప్తి కోసం, మీ సంతోషం కోసం మిమ్మల్ని మీరే ఈ ప్రశ్నలు వేసుకుంటే.. మీ లైఫ్‌ను మీరు తీర్చిదిద్దుకున్న వారవుతారు.

జీవితంలో మనకు తారసపడే ప్రతి పరిస్థితి నువ్వేం కావాలనుకుంటున్నావ్ అని మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది సామాజికంగా కావొచ్చు, పేరెంట్‌గా కావొచ్చు, కల్చరల్‌గా కావొచ్చు. "కెరీర్ మార్చుకోవాలా, పిల్లల్ని కనాలా, రిలేషన్‌షిప్ ఇక్కడితో ఆపేద్దామా, మీ సొంత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత హోదా కోసం ఇంకా ప్రయత్నించాలా, ఏదైనా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఫ్రెండ్స్‌తో ఎంజాయ...