Hyderabad, మార్చి 9 -- మంచి బాస్ అంటే అలా ఇలా ఉండాలి అని ఎవరూ చెప్పలేరు. కానీ అందరితో మంచిగా మాట్లాడాడటం వారికుండాల్సిన ముఖ్య లక్షణం. మంచిగా మాట్లాడితే కింద పనిచేసే ఉద్యోగులు దాన్ని అలుసుగా తీసుకుని పని చేయడం మానేస్తారేమో అనే భయం కొందరిలో ఉంటుంది. అలా అని తప్పు ఒప్పులను ఎంచి మందలిస్తే మా బాస్ టార్చర్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతారేమో అనే ఫీలింగ్ కూడా కొందరిలో ఉంటుంది.

మీరు కూడా ఇలాంటి తర్జనబర్జనలోనే ఉండి ఉంటే మీ కింద పనిచేసే లేకపోతే మీ పనిచేసే సహాద్యోగులతో ఆఫీసులో ఎలా మాట్లాడాలో, వారితో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ తెలుసుకోవచ్చు. మంచి బాస్ అనిపించుకునే చాలా మంది వ్యక్తులు ఆఫీసులో ఇలాంటి మాటలను ఎక్కువగా ఉపయోగిస్తారట.అవేంటో చూద్దాం రండి..

మంచి బాస్ అనిపించుకోవాలంటే ఇతరుల కష్టానికి ఫలితం మీరు అనుభవించడం కాదు వారే అనుభవించేలా చేయాలి. ఉద్యోగుల కష్ట...