Hyderabad, ఫిబ్రవరి 3 -- మారిన పరిస్థితుల ప్రభావం మన చూట్టూ కనిపిస్తోంది. ఒకప్పుడు పనిమనిషులను పెట్టుకోవడం కేవలం కొంతమందికి మాత్రమే కానీ ఇప్పడు అది సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లేవారే అయితే పనిమినిషి తప్పనిసరి అయిపోయింది. అయితే కొందరి ఇళ్లల్లో పనివారు కూడా పనిచేస్తూ పనిచేస్తూ ఇంటి మనుషుల్లో భాగమవుతారు. యజమానులు కూడా వారితో స్నేహితుల్లా కలిసిపోయి ఉంటుంటారు. వాస్తవానికి ఇది మంచి పద్ధతే, వారు కూడా మనుషులే కనుక వారితో అలా ఉండటంలో తప్పేం లేదు. కానీ కొన్నిసార్లు ఇది ప్రమాదకరం కావచ్చు.

పని మనుషులతో మీరు మంచిగానే ఉండచ్చు కానీ వారిలో ఏదైనా చెడు ఉద్దేశం లేదా లోభం ఉంటే పరిస్థితి ఏంటి? అలాంటి సందర్భాల్లో మీరు ప్రమాదంలో పడచ్చు. మీ కొంపముంచే పని జరగచ్చు. కనుక మీ ఇంట్లో పనివారు ఎంత మంచి వారైనా, వారికి మీకు ఎంత చనువ...