Hyderabad, మార్చి 22 -- ఇంటిని అందంగా, ఆకర్షణీంగా అలంకరించుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. కానీ అద్దె ఇంట్లో మనకి నచ్చినట్టు మనం చేయలేం కదా అని కొందరు, ఇదెలాగూ మన సొంతిల్లు కాదు కదా అని మరికొందరు ఇంటిని అందంగా అలంకరించాలనే తమ ఆశను పక్కన పెట్టేస్తున్నారు. భారతీయ పరిశోధన సంస్థ తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం దాదాపు 59 శాతం మంది భారతీయులు తమ సొంత ఇంటి కల ఎప్పటికీ నెర్చుకోలేకపోతున్నారట. ప్రాపర్టీ ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి కాబట్టి ఇందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదనుకోండి.

మీరు కూడా అద్దె ఇంట్లో ఉంటుంటే.. ఇంటి అలంరణ అంటే మీకు ఇష్టమైతే మీ ఆశను పక్కకు పెట్టేయకండి. ఈ చిట్కాలతో మీ డబ్బు, శ్రమ వృథా కాకుండా, మీరు ఇళ్లు మారినా మీ అలంకరణ సామాగ్రి మీతోనే తీసుకెళ్లేలా సృజనాత్మకతతో మీ ఇంటిని అలంకరించుకోండి. అది కూడా చాలా తక్కువ ధరతో. ఎలాగో ఇక్కడ తె...