Hyderabad, ఏప్రిల్ 11 -- Horror Thriller Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు ఖౌఫ్ (Khauf). అంటే భయం అని అర్థం. ఓ అమ్మాయిల హాస్టల్, అక్కడి అతీత శక్తుల చుట్టూ తిరిగే కథలా ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. వచ్చే వారం ఈ కొత్త వెబ్ సిరీస్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కొన్ని రోజుల కిందటే ఖౌఫ్ అనే ఈ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 18 నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు కూడా అప్పుడే వెల్లడించింది. అయితే సరిగ్గా వారం ముందు అంటే శుక్రవారం (ఏప్రిల్ 11) ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రజత్ కపూర్, చమ్ దరంగ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ ట్రైలరే భయపెడుతోంది.

స్వేచ్ఛగా తనకు తానుగా బతకాలని కలలు కంటూ ఢిల్...