భారతదేశం, ఏప్రిల్ 13 -- ఛోరీ 2 చిత్రం హైప్ మధ్య వచ్చింది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఛోరీకి సీక్వెల్‍గా మంచి అంచనాలతో ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది. అందుకు తగ్గట్టే ఛోరీ 2 సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది.

ఛోరీ 2 చిత్రం ఈ శుక్రవారం (ఏప్రిల్ 11) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి బజ్ ఉండటంతో ఆరంభం నుంచి ఈ చిత్రానికి భారీగా వ్యూస్ దక్కాయి. దీంతో ఇప్పుడే ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల ట్రెండింగ్ లిస్టులో ఛోరీ 2 టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ప్రస్తుతం (ఏప్రిల్ 13) ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.

ఛోరీ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో హిందీలో ఒక్కటే అందుబాటులోకి వచ్చింది. ఇం...