భారతదేశం, ఏప్రిల్ 1 -- Horror Thriller Movie: కొన్నాళ్లుగా భాషాభేదాల‌తో సంబంధం లేకుండా హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల ట్రెండ్ ఎక్కువ‌గా న‌డుస్తోంది. ముంజ్య, స్త్రీ 2 తో పాటు హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశాల‌తో రూపొందిన ప‌లు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షాన్ని కురిపించాయి.

ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌స్తోన్న తెలుగు మూవీ అమరావతికి ఆహ్వానం . ఈ సినిమాలో ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, సుప్రిత హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. 'అక్క‌డొక‌డుంటాడు ఫేమ్ శివ కంఠంనేని హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి జివికె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు ఈ పోస్ట‌ర్‌లో లీడ్ యాక్ట‌ర్స్ అంద‌రూ బ్లాక్ డ్రెస్ వేసుకునిసీరియ‌స్‌ లుక్‌లో క‌ని...