భారతదేశం, మార్చి 22 -- Horror OTT: విజ‌య్ సేతుప‌తి పిజ్జా మూవీని ఓటీటీలో ఈ వీకెండ్ ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమాఉచితంగాస్ట్రీమింగ్ అవుతున్న‌ట్లు స‌న్ నెక్స్ట్ ఓటీటీ ప్ర‌క‌టించింది. పిజ్జా మూవీతో పాటు ప్ర‌కాష్ రాజ్ ధోనీ సినిమాను స‌బ్‌స్క్రిప్ష‌న్ లేకుండానే త‌మ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చ‌ని వెల్ల‌డించింది. మార్చి 21 నుంచి 23 వ‌ర‌కు ఈ ఫ్రీ ఆఫ‌ర్ ఉంటుంద‌ని స‌న్ నెక్స్ట్ అనౌన్స్ చేసింది.

పిజ్జా మూవీకి కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2012లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ త‌మిళంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ మూవీతోనే హీరోగా కోలీవుడ్‌లో విజ‌య్ సేతుప‌తి పాపుల‌ర్ అయ్యాడు. టాప్ హీరోగా మారిపోయాడు. కేవ‌లం కోటిన్న‌ర బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఎనిమిది కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

త‌మిళంలోనే కాకుండా తెలుగు, మ‌ల‌యాళం డ‌బ్ అయిన ఈ మూవీ క‌మ‌...