భారతదేశం, ఫిబ్రవరి 8 -- Horror OTT: ఎన్టీఆర్ శ‌క్తి సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టించింది మంజ‌రి ఫ‌డ్నీస్‌. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, మ‌ల‌యాళంతో పాటు ప‌లు భాష‌ల్లో సినిమాలు చేసింది.. మంజ‌రి ఫ‌డ్నీస్ హీరోయిన్‌గా న‌టించిన మ‌రాఠీ మూవీ అదృశ్య థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. మ‌రాఠీతో పాటు హిందీ భాష‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన అదృశ్య మూవీలో పుష్క‌ర్ జాగ్ హీరోగా న‌టించాడు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. స్పానిష్ మూవీ జూలియ‌స్ ఐస్‌ ఆధారంగా అదృశ్య మూవీ తెర‌కెక్కింది. క‌బీర్ లాల్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అదృశ్య మూవీలో మంజ‌రి ఫ‌డ్నీస్ డ్యూయ‌ల్ రోల్ చేసింది. స‌యాలి, సానిక ట్విన్ సిస్ట‌ర్స్‌....